Tuesday 26 July 2011

TELUGU NATAKAM (DRAMA) - తెలుగు నాటకం

భారతీయ కళా సాంస్కృతిక రంగాలలో తెలుగు నాటకానికి ఉన్న స్థానం అద్వితీయమైనది.అది సాంఘికమైనా,పౌరాణికమైనా,చారిత్రికమైనా లేక జానపదమైనా ఒక విశిష్టతను సంతరించుకున్నది.పాత్రోచితమైన నటీనటుల ఎంపికకు మనం అధిక ప్రాధాన్యమిస్తాము.అహార్యం విషయంలో కూడ మనం ప్రత్యేకతను చాటుకుంటాము.సినిమా ఐనా నాటకమైనా మన వేషభాషలు పాత్రోచితంగా ఉంటాయి.మరీ ముఖ్యంగా పౌరాణికాల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.అయితే ఇంత విశిష్టమైన తెలుగు నాటకం రాబోయే తరాలకు మన వారసత్వంగా అందుతుందో లేదో అన్న సందేహం నాటక ప్రియుల మనస్సులను పట్టి పీడిస్తున్నది.ఎందుకంటే ఈ రోజున నాటాకాలు వేస్తున్న మరియు చూస్తున్న వాళ్ళ సగటు వయసు యాభై యేళ్ళ పై మాటే మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయేరోజుల మాటేమిటి?ఇకనైనా అందరం ఈ సమస్యపై దృష్టి సారిద్దాం.