Tuesday 13 September 2011

రసరమ్య కళారంజని - నల్లగొండ


ఈ సంస్థ వ్యవస్థాపకులు డా.పడాల బాలకోటయ్య. రి.నెం.20/2002.ఇప్పటివరకు వీరు సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకాన్ని,పుణ్యస్థలం,సద్గతి,ముసుగు నాటికలను రూపొందించిపదులసంఖ్యలో ప్రదర్శనలనిచ్చారు.ఇదే కాకుండా సోదర సంస్థలవారిచే,  అలరాసపుట్టిల్లు, ఏ వెలుగులకీప్రస్థానం, ఉషాపరిణయం, శ్రీ కృష్ణతులాభారం వంటి ఎన్నో నాటక ప్రదర్శనలను ఏర్పాటుచేసారు.సురభి జమునారాయలు కృష్ణుడుగా, జయనిర్మల సత్యభామగా, సురభి కోటేశ్వరి నారదుడుగా నటించిన తులాభారం నాటకం రసజ్ఞుల మన్ననలను చూరగొన్నది.ఇవే కాకుండా మరెన్నో నృత్యనాటికల ప్రదర్శన కూడా ఏర్పాటుచేసారు.ప్రతియేటా 'ప్రపంచ రంగస్థలదినొత్సవం' జరపడంతో పాటుగా ఇప్పటివరకు దాదాపు 78 మంది రంగస్థలనటులు,కళాకారులు మరియు సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు.
   కళారంగానికి విశిష్టమైన సేవలనందిస్తున్న డా.బాలకోటయ్య గారికి డా.సూరేపల్లి గురునాధం,                           శేఖర్ రెడ్డి, ఎస్.జయప్రకాశ్, యం.రఘురాములు, జి.నరేందర్, డా.యం.పురుషోత్తమాచార్య, నండూరి కృష్ణమాచార్యులు, యాక అబ్బయ్య, ఆవుల నాగేశ్వరరావు, పి.సి.పి.దాస్, కప్పి సత్యనారాయణ, సత్యవతి, ఎన్.సి.పద్మ, రుక్మిణి మరియు జానకి తదితరులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు.

No comments:

Post a Comment