Saturday 10 September 2011

వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక.

ఈ సంస్థ గత ఎనిమిదేళ్ళుగా 'నాటిక పోటీలు ' నిర్వహిస్తున్నది.దీని అధ్యక్షులు పందిళ్ళ శేఖర్ బాబు మరియు కార్యదర్శి కాసిపేట తిరుమలయ్య. . 2003వ సం.లో గుంటూరు కేంద్రంగా ప్రారంభింపబడ్డ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళకారుల ఐక్యవేదికకు వరంగల్ జిల్లా శాఖగా ఇది ఆవిర్భవించింది. డాక్టర్.భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షులుగా,శతపతి శ్యామలరావు కార్యదర్శిగా తొలి మూడేళ్ళూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.అందులో ముఖ్యమైనవి తెలంగాణాస్థాయి నాటిక పోటీలు మరియు కళాకారుల క్రెడిట్ కార్పొరేషన్.50 మంది సభ్యులుగా చేరిన ఈ కార్పొరేషన్ లాభాల్లోనుండి సగాన్ని నాటకరంగ అభ్యున్నతికి వినియోగిస్తారు.సంస్థ నిర్వహించే నాటిక పోతీలను,దాతలు మరియు ప్రాయోజకులు అందించే  ఆర్థిక సహకారంతో నిర్వహిస్తారు.విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ కళాసామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈ సంస్థకు,వనం లక్ష్మీకాంతరావు,బోయినపల్లి పురుషొత్తమరావు, డా.భండారు ఉమామహేశ్వరరావు వంటి అనుభవజ్ఞులు తమ సలహాలను,సూచనలను అందిస్తున్నారు.సోదరసభ్యులు యెలిగేటి సాంబయ్య,సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి,శతపతి శ్యామలరావు,వేముల ప్రభాకర్,జీ.వీ.బాబు,బి.శ్రీధరస్వామి,రామనరసిమ్హ స్వామి, రాగి వీరబ్రహ్మాచారి,మట్టెవాడ అజయ్,రంగరాజు బాలకిషన్,సామల లక్ష్మణ్,ఆకుతోట లక్ష్మణ్,కళా రాజేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి,జి.రవీందర్,దేవర్రాజు రవీందర్ రావు,ఆకుల సదానoదం,యం.వి.రామారావు తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.        

No comments:

Post a Comment