తెలుగు నాటకరంగానికి ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉన్నది. ఒకనాడు యావదాంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం మధ్యలో కొంతకాలం స్తబ్ధంగా ఉన్నది. ఇటీవలి కాలంలో నంది , తదితర పరిషత్తుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకుంటున్నది. ఈ రంగంలో కృషి చేసిన మరియు చేస్తున్న సంస్థలను, కళాకారులను పరిచయం చేస్తూ, నాటకానికి సంబంధించి నాలుగు మంచి విషయాలను మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం.
Wednesday, 14 September 2011
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
Tuesday, 13 September 2011
రసరమ్య కళారంజని - నల్లగొండ
ఈ సంస్థ వ్యవస్థాపకులు డా.పడాల బాలకోటయ్య. రి.నెం.20/2002.ఇప్పటివరకు వీరు సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకాన్ని,పుణ్యస్థలం,సద్గతి,ముసుగు నాటికలను రూపొందించిపదులసంఖ్యలో ప్రదర్శనలనిచ్చారు.ఇదే కాకుండా సోదర సంస్థలవారిచే, అలరాసపుట్టిల్లు, ఏ వెలుగులకీప్రస్థానం, ఉషాపరిణయం, శ్రీ కృష్ణతులాభారం వంటి ఎన్నో నాటక ప్రదర్శనలను ఏర్పాటుచేసారు.సురభి జమునారాయలు కృష్ణుడుగా, జయనిర్మల సత్యభామగా, సురభి కోటేశ్వరి నారదుడుగా నటించిన తులాభారం నాటకం రసజ్ఞుల మన్ననలను చూరగొన్నది.ఇవే కాకుండా మరెన్నో నృత్యనాటికల ప్రదర్శన కూడా ఏర్పాటుచేసారు.ప్రతియేటా 'ప్రపంచ రంగస్థలదినొత్సవం' జరపడంతో పాటుగా ఇప్పటివరకు దాదాపు 78 మంది రంగస్థలనటులు,కళాకారులు మరియు సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు.
కళారంగానికి విశిష్టమైన సేవలనందిస్తున్న డా.బాలకోటయ్య గారికి డా.సూరేపల్లి గురునాధం, శేఖర్ రెడ్డి, ఎస్.జయప్రకాశ్, యం.రఘురాములు, జి.నరేందర్, డా.యం.పురుషోత్తమాచార్య, నండూరి కృష్ణమాచార్యులు, యాక అబ్బయ్య, ఆవుల నాగేశ్వరరావు, పి.సి.పి.దాస్, కప్పి సత్యనారాయణ, సత్యవతి, ఎన్.సి.పద్మ, రుక్మిణి మరియు జానకి తదితరులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు.
Sri Krishna Rayabaram- Padyanatakam-Telugu Drama Slideshow Slideshow
Sri Krishna Rayabaram- Padyanatakam-Telugu Drama Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Sri Krishna Rayabaram- Padyanatakam-Telugu Drama Slideshow Slideshow ★ to Tirupati. Stunning free travel slideshows on TripAdvisor
Ikya Vedika Drama Competitions-2008 Slideshow Slideshow
Ikya Vedika Drama Competitions-2008 Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Ikya Vedika Drama Competitions-2008 Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
Monday, 12 September 2011
Lava Kusa Padyanatakam Slideshow Slideshow
Lava Kusa Padyanatakam Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Lava Kusa Padyanatakam Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
Sunday, 11 September 2011
Saturday, 10 September 2011
వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక.
ఈ సంస్థ గత ఎనిమిదేళ్ళుగా 'నాటిక పోటీలు ' నిర్వహిస్తున్నది.దీని అధ్యక్షులు పందిళ్ళ శేఖర్ బాబు మరియు కార్యదర్శి కాసిపేట తిరుమలయ్య. . 2003వ సం.లో గుంటూరు కేంద్రంగా ప్రారంభింపబడ్డ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళకారుల ఐక్యవేదికకు వరంగల్ జిల్లా శాఖగా ఇది ఆవిర్భవించింది. డాక్టర్.భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షులుగా,శతపతి శ్యామలరావు కార్యదర్శిగా తొలి మూడేళ్ళూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.అందులో ముఖ్యమైనవి తెలంగాణాస్థాయి నాటిక పోటీలు మరియు కళాకారుల క్రెడిట్ కార్పొరేషన్.50 మంది సభ్యులుగా చేరిన ఈ కార్పొరేషన్ లాభాల్లోనుండి సగాన్ని నాటకరంగ అభ్యున్నతికి వినియోగిస్తారు.సంస్థ నిర్వహించే నాటిక పోతీలను,దాతలు మరియు ప్రాయోజకులు అందించే ఆర్థిక సహకారంతో నిర్వహిస్తారు.విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ కళాసామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈ సంస్థకు,వనం లక్ష్మీకాంతరావు,బోయినపల్లి పురుషొత్తమరావు, డా.భండారు ఉమామహేశ్వరరావు వంటి అనుభవజ్ఞులు తమ సలహాలను,సూచనలను అందిస్తున్నారు.సోదరసభ్యులు యెలిగేటి సాంబయ్య,సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి,శతపతి శ్యామలరావు,వేముల ప్రభాకర్,జీ.వీ.బాబు,బి.శ్రీధరస్వామి,రామనరసిమ్హ స్వామి, రాగి వీరబ్రహ్మాచారి,మట్టెవాడ అజయ్,రంగరాజు బాలకిషన్,సామల లక్ష్మణ్,ఆకుతోట లక్ష్మణ్,కళా రాజేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి,జి.రవీందర్,దేవర్రాజు రవీందర్ రావు,ఆకుల సదానoదం,యం.వి.రామారావు తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
Subscribe to:
Posts (Atom)